SAKSHITHA NEWS

బిఎల్అర్ విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి , చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్

చదువు బాధ్యత మీది ఫీజు బాధ్యత నాది అని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చదువుల్లో ప్రతిభ చూపుతున్న పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచి వారి డాక్టర్ కలను నిజము చేస్తానని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడా లేనివిధంగా ఒక ప్రజలు ఎన్నుకోబడిన శాసనసభ్యులు పేద ప్రజల పిల్లల చదువుకు తాను అండగా నిలుస్తానని ఆర్థికంగా మరియు అన్ని రకాలుగా వారికి తోడ్పాటు అందిస్తానని ముందుకు వచ్చిన బండారి లక్ష్మారెడ్డి .

చిల్కానగర్ డివిజన్ మల్లికార్జున్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వి నందిని , వొరుసు యాదమ్మ ఈదయ్య ల కుమార్తె ఇటీవలే జరిగిన నీట్ ఎంట్రెన్స్ లో రాష్ట్రస్థాయిలో ఎంబిబిఎస్ పరీక్షల్లో ర్యాంకు సాధించడంతో ఎంబిబిఎస్ సీటు పొందారు.

వి నందిని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేరుగా నందిని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ ఎంబిబిఎస్ పూర్తయ్యేవరకు 5 సంవత్సరాలకు కావలసిన ఫీజు రూపాయలు ఇరవై తొమ్మిది వేల చొప్పున ప్రతి సంవత్సరం తానే అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఈ మొదటి సంవత్సరం ఇరవై తొమ్మిది వేల రూపాయల చెక్కును నందిని కి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద కుటుంబాల విద్యార్థులకు గవర్నమెంట్ కౌన్సిలింగ్లో ఎంబిబిఎస్ సీటు పొందిన ప్రతి ఒక్కరికి తాను ఆర్థికంగా అండగా నిలబడతానని వారికి కావలసిన ఐదు సంవత్సరాల ఫీజును తానే కడతానని అన్నారు

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు ,ఉద్యమ నాయకులు ,మహిళా నాయకురాలు, మల్లికార్జున్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నందిని కుటుంబ సభ్యులు మొదలగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS