జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
మిషన్ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమ అమలుపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతాశిశు సంరక్షణలో భాగంగా ప్రాణాంతక వ్యాధుల నుండి గర్భిణులు, చిన్నారులను కాపాడేందుకు టీకాలు వేసే కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 0-5 సంవత్సరాల పిల్లలు 114802 మంది ఉన్నట్లు ఆయన అన్నారు. మిషన్ ఇంద్రధనుస్సు అమలుకు మొదటి విడతగా ఆగస్టు 7 నుండి 12 వరకు, రెండో విడత సెప్టెంబర్ 11 నుండి 16 వరకు, మూడో విడత అక్టోబర్ 9 నుండి 14 వరకు కార్యాచరణ చేసినట్లు ఆయన అన్నారు.
పట్టణ ప్రాంతాల్లో 285, గ్రామీణ ప్రాంతాల్లో 1432 మొత్తంగా 1717 మంది డ్రాప్ అవుట్ పిల్లలు, గర్భిణులు ఉన్నట్లు ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 61, గ్రామీణ ప్రాంతాల్లో 476 సెషన్స్ చేపట్టి, మిషన్ ఇంద్రధనుస్సు అమలుచేయనున్నట్లు ఆయన అన్నారు. లక్ష్యం మేరకు ప్రతి ఒక్కటి టీకాలు అందేట్లుచర్యలు తీసుకోవాలని, సంచార జాతులు, పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులకు టీకాలు వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మీసేల్స్, రూబెల్లా ను దేశం నుండి పారద్రోలడానికి రోడ్ మ్యాప్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ప్రాజెక్ట్ అధికారులు డా. ప్రమీల, డా. సైదులు, సర్వీలెన్స్ వైద్యాధికారి డా. ప్రశాంత్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.