గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్‌టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం కావడంతో 16 రోజులుగా సమ్మె చేస్తున్న వారు సమ్మె విరమించినట్టు ప్రకటించారు. విధుల్లో చేరుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం ేస్కల్ మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించేందుకు సీఆర్‌టీలు అంగీకరించారు.ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, మరణ ప్రయోజనాలు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు కాంట్రాక్టు గురుకుల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మాలోతు సోమేశ్వర్ తెలిపారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం ేస్కల్ డిమాండ్లపై సీఎంతో చర్చించేందుకు మరోసారి సమావేశానికి మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు వివరించారు
(సీఆర్‌టీ)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం
Related Posts
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి
SAKSHITHA NEWS విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ నియామకం రెండేళ్ల పాటు విజిలెన్స్ డైరెక్టర్ గా కొనసాగునున్న ఏఆర్ శ్రీనివాస్ SAKSHITHA NEWS
కవిత బీసీ నినాదం: రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్సెనని మరచిపోతారా
SAKSHITHA NEWS కవిత బీసీ నినాదం: రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్సెనని మరచిపోతారా? భారత జాగృతి నాయకురాలు.. కల్వకుంట్ల కవిత రాజకీయంగా యాక్టివ్ అయిన తర్వాత అందుకున్న బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఓ సభను హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నారు.…