
మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ , దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , శాసన మండలి చీఫ్ విప్ ,ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీలు బాను ప్రసాద్ , కోదండరాం , ప్రభాకర్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ , దానం నాగేందర్ , గణేష్ తో కలిసి జాతిపిత మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అహింసా మార్గంలో నడిచి, సత్యాన్ని ఆయుధంగా మార్చి దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు తెలియచేస్తున్నాను అని,
అహింస ఆయుధంగా, సత్యం, ధర్మం, సైన్యంగా స్వాతంత్ర పోరాటానికి దిక్సూచి మహాత్ముడు అని ,వారి జీవనమే జాతికి సందేశం అని, ప్రతి పేదవాడి పెదాలపైన చిరునవ్వు చూడాలనే సంకల్పంతో వారి మార్గంలో పయనిస్తూ, వారి ఆశయాలను ఆదర్శాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు . ప్రతి ఒక్కరూ మహాత్ముడు చూపిన బాటలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. అహింస మార్గం లో గాంధేయమార్గం లో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్ముడు గాంధీ అని,PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు , కులాలు ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత దేశం నుండి పారదోలి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించిన మహానుభావుడు మహాత్మ గాంధీ అని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది .ఈ రోజు స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే అది ఆ మహాత్ముడి కృషి ఫలితమే అని సత్యాగ్రహం ,అహింస ,నిజాయితీ వంటి మార్గాలను ఎంచుకొని అటువైపుగా ప్రజలను భాగస్వామ్యం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు. మహాత్ముడు చూపిన బాటలో అందరు నడవాలని,గాంధీ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలి అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పిలుపునివ్వడం జరిగినది . శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని , ప్రతి ఒక్కరు మహాత్ముడి ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుంది అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app