SAKSHITHA NEWS
Minister Nadendla inspected the warehouses

గోదాములు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల

రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ గోదాములను శనివారం తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరి లోనూ గోదాములను తనిఖీ చేయించారు.

అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార,నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు.

వారం రోజుల్లో సమగ్ర
నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.