SAKSHITHA NEWS

బన్నీ ఫ్యాన్స్‌కు మెంటలెక్కించే అప్‌డేట్… ఆ థియేటర్‌లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్..!!

ఎప్పుడెప్పుడు షో మొదలవుతుందా… అల్లు అర్జున్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏ థియేటర్ దగ్గర చూసిన బన్నీ కటౌట్స్‌తో, ఫ్లెక్స్‌లతో థియేటర్‌లు కొత్తగా పెళ్లికి ముస్తాబయ్యాయి.
9:30 గంటలకు స్పెషల్ షో ఉంటే.. ఇప్పుటికే ఫ్యాన్స్ థియేటర్‌లకు కదిలి వస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత బన్నీని స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ మురిపెం అంతా ఇంతా కాదు.. లిటరల్‌గా పండగ చేసుకుంటున్నారు.

వెయ్యి డ్రమ్స్ ఒకేసారి మారుమోగితే ఎట్టా ఉంటదో.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గుండెల శబ్ధాలు అలానే ఉన్నాయి. దానికి తోడు.. ఈ సినిమాపై ఉన్న యుఫోరియాకు పిచెక్కిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు.. ఏ థియేటర్‌లో పుష్పగాడి బొమ్మే. అసలు.. మార్కెట్‌లో ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే మెంటలొచ్చింది. ఇక ఇదిలా ఉంటే… బన్నీ సైతం.. ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూడబోతున్నట్లు సమాచారం. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాడ్స్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో రాత్రి 9:30 గంటల షోకు బన్నీ ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూడడానికి వస్తున్నట్లు టాక్. ఈ దెబ్బతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. జామ్ అవడం పక్కా.

ఇక పుష్ప2 ఫీవర్ ఇండియాను వణికిస్తుంది. ఇప్పటికే పుష్ప గాడి రూల్ ఆల్ ఓవర్ ఇండియా కొనసాగుతుంది. ఇక రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. టీజర్ దెబ్బతో అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ సారి పుష్పగాడి ఊచకోత మాములుగా ఉండదని ఆ మధ్య రిలీజైన టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది.

దానికి తోడు సినిమాకు సంబంధించిన పలు లీకులు బన్నీ ఫ్యాన్స్ నే కాదు.. యావత్ సినీ లవర్స్ లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. గతేడాది రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్ లలోనూ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. అసలు ఆ మధ్య రిలీజైన ట్రైలర్ ట్రాన్స్ నుంచి బన్నీ ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేకపోతున్నారు.

ప్రస్తుతం సీక్వెల్ కున్న క్రేజ్ చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చిన ఊహకందని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టడడం ఖాయం అనిపిస్తుంది. దానికి తోడు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లు చేస్తూ.. సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ సినిమా గురించి ఆడియెన్స్ మాత్రమే కాదు.. సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.


SAKSHITHA NEWS