SAKSHITHA NEWS
Metro train to Vijayawada?

విజయవాడకు మెట్రో రైలు?
విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్‌ సిద్ధమైనా వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో మూలన పడింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు.