SAKSHITHA NEWS

పంచకర్లను సత్కరించిన సంకల్ప సేవా సమితి సభ్యులు..

సాక్షిత :- విశాఖపట్నం లోని పుర ప్రముఖులు సభ్యులుగా ఏర్పడి సంకల్ప సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ను ఏర్పాటు చేసి గత 13 సంవ త్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వ హిస్తున్న సంకల్ప సేవా సమితి కార్యవర్గ సభ్యుల బృందం పంచకర్ల రమేష్ బాబు ని కలిసి, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలో వారి అద్వితీయ విజయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేసారు.సంకల్ప సేవా సమితి అధ్యక్షులు, కొమ్మన శ్రీనివాస రావు ఉపాధ్యక్షులు అందే మహేష్, కార్యదర్శి దాసరి సురేష్ బాబు, ఉప కార్యదర్శి ఇమ డబత్తిన శివ, కోశా ధికారి నార్నిండి మాధవ రావు, కార్యవర్గ సభ్యులు ఎన్ వి సత్యనారాయణ,

మిత్తిరెడ్డి తిరుపతి నాయుడుమరియు ఇతర ప్రముఖులు బుద్దిరెడ్డి సత్యనారాయణ, బొత్స సురేష్ కుమార్, పైడ స్వరూప్, తలాటం వీర రాఘవరావు, మేడిది రాజశేఖర్, అడబాల నాని, కొట్టు వెంకటేశ్వర రావు, మున్నంగి విజయ లక్ష్మి తదితరులు పంచకర్ల రమేష్ బాబు కి పుష్ప గుచ్ఛం సమర్పించి శాలువా తో సత్కరించి అభినందనలు తెలియ చేయటం జరిగింది. సమాజంలో పేదవారికి తెలివైన విద్యార్థులకు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు నడవ వలసిందిగా పంచకర్ల రమేష్ బాబు సంకల్ప సేవా సమితి సభ్యులకు సూచించారు.


SAKSHITHA NEWS