ప్రగతి నగర్‌లో మెగా హెల్త్ క్యాంప్ – కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వానం ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో, రాబోయే ఆదివారం 24-08-2025న యశోద హాస్పిటల్ మరియు ఫర్ ద పీపుల్స్ సొసైటీ సహకారంతో,సేవ్ ఫార్మసీ సర్జికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న మెగా హెల్త్ క్యాంప్ సందర్భంగా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం హన్మంతన్న ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరిగే ఈ మానవతావాద కార్యక్రమంలో తానే తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫర్ ద పీపుల్స్ సొసైటీ అధ్యక్షుడు క్రాంతి రణదేవ్, సురేందర్, శివ, క్రాంతి, అనిల్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
