ముక్కోటిలో భక్తులకు వైద్య సేవలు…
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం, శంఖు తీర్థంకు వచ్చే భక్తులకు స్థానిక అర్బన్ యూపీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించి మందుల అందజేశారు. వైద్య శిబిరంలో ఇందిరానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శిబిరంకు వచ్చిన భక్తులకు ఎంహెచ్పివీ వ్యాధి సోగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఏ లు షాదిక్ హుస్సేన్, ఏ వాసు బాబు, హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.