SAKSHITHA NEWS

జిజీయూలో 13 నుంచి మేధ ఉత్సవాలు
సాక్షిత రాజమహేంద్రవరం :
ఇంజనీర్లు దినోత్సవం సందర్భంగా గోదావరి గ్లోబల్ విశ్వ విద్యాలయంలో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మేధ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు) రిజిస్ట్రార్ డాక్టర్ పి. ఎం.ఎం.ఎస్ .శర్మ తెలిపారు. ఈ ఉత్సవాలు రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిజియూలో శనివారం జరిగిన కార్యక్రమంలో మేధ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ మేధలో పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్ పో, ఇంట్రాక్టివ్ వెబ్ డిజైన్,(HackThan) హాక్ తన్, రోబో రేస్, టెక్నికల్ క్విజ్, టెక్నికల్ టాక్స్, ఫిలిం మేకింగ్, ట్రజర్ హంట్ తోబాటు స్పాట్ ఈవెంట్స్ కూడా ఉంటాయని చెప్పారు. పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి కలవారు www.ggu.edu.in/medha (or)https://ggu-medha-2024-netlify.app లో సెప్టెంబర్ 10వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా మేధ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఎం . శ్రీనివాసరావు, గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి., జయానంద కుమార్, గైట్ ఇంజనీరింగ్ కళాశాలఅటానమస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం .వి. ఎస్ .బాబు, గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి .జి .రామానుజం, గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వల్లి మాధవి, గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రామచంద్రన్, జి జి యు డీన్ డాక్టర్ ఎన్. లీలావతి, మేధ కన్వీనర్లు డాక్టర్ బి. సుజాత, డాక్టర్ ఆర్. తమిళ కోడి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS