SAKSHITHA NEWS

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి
——– జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి
సాక్షిత వనపర్తి సెప్టెంబర్ 5

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి అన్నారు గురువారం ఉదయం పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థుల చేత ప్రార్థన చేయించి వ్యక్తిగత పరిశుభ్రత పై పలు సూచనలు చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన వేడి భోజనం అందించాలని అన్నారు వసతి గృహ ఆవరణ పరిసర ప్రాంతాలు వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని భోజనానికి ముందు భోజనం తర్వాత సబ్బుతో చేతులు కడుకోవాలని అన్నారు విద్యార్థులకు జ్వరం లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే తగు చర్యలు తీసుకొని దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని వసతి గృహ సంక్షేమ అధికారి సిబ్బందికి ఆదేశించారు ప్రతి ఆదివారం వసతి గృహంలో స్వచ్ఛభారత్ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సిబ్బంది విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి బి.జి అమృత సాగర్ వసతి గృహ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS