అన్ని వర్గాల శ్రేయస్సు కోరే వ్యక్తి మౌటం – తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు పెర్క రమాకాంత్
- టీజేయు ప్రెస్ క్లబ్ లో ఎం కే కి ఘనం గా సన్మానం
కమలాపూర్ సాక్షిత
ముదిరాజ్ ల జాతి ఐక్యత కు మౌటం కుమారస్వామీ చేసిన సేవలను గుర్తించి ముదిరాజ్ మహాసభ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా ఎం కే ను నియమించారని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కమలాపూర్ మండల అధ్యక్షులు పెర్క రమాకాంత్ అన్నారు. టీజేయు ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డా,, మౌటం కుమారస్వామీ ముదిరాజ్ మహా సభ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన సందర్బంగా టీజేయు సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా టీజేయు మండల అధ్యక్షులు పెర్క రమాకాంత్ మాట్లాడుతూ ముదిరాజుల జాతి సమస్యల పై ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కుమారస్వామీ అని ఆయన గతం లో ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసారని ఆయన సేవలను కొనియాడారు.
అలాగే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గా ఉండి ఇటు విలేకరుల సమస్యల పై అటు ముదిరాజుల సమస్యల పరిష్కారం చేసే వ్యక్తి డా,, మౌటం కుమారస్వామీ అని ఆయన సేవలను గుర్తించి ముదిరాజ్ మహా సభ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గా నియామకం అయినందుకు డా,, మౌటం కుమారస్వామీ కి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మండల అధ్యక్షులు పెర్క రమాకాంత్ అన్నారు. ఈ సందర్బంగా డా,, మౌటం కుమారాస్వామీ మాట్లాడుతూ ముదిరాజు ల ఐక్యత కు జాతి సమస్యల పరిష్కారానికి పాటు పడుతానని అలాగే జిల్లా వ్యాప్తంగా ముదిరాజ్ మహా సభ నీ బలోపేతం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కమలాపూర్ మండల ప్రధాన కార్యదర్శి పెండెం రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎడ్ల నాగరాజు, గౌరవ సలహా దారులు వెంగళ విజయ్,కొలె దామోదర్, సభ్యులు కిన్నెర వేణు, పుల్ల సందీప్,ఎర్రం రంజిత్, డాకూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.