SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్పల్లి డివిజన్ (పార్ట్) పరిధిలో గల పాపిరెడ్డి నగర్ , ఆస్బె స్టాస్ కాలనీ లలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో కలిసి పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లలో స్వయంగా ఇంటిటికి తిరుగుతూ ప్రజల నుండి తెలుసుకొని సత్వర పరిష్కారమే గా ధ్యేయంగా పనిచేస్తామని ,ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


కాలనీల లో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది.అదేవిధంగా కాలనీల లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మరియు . ముఖ్యంగా డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
,మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా కూకట్పల్లి డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

కాలనీ లలో గడప గడపకు కలియ తిరుగుతూ అవ్వలను ఆప్యాయంగా పలకరిస్తూ ,ఐటి యువకులను మరియు రాజస్థాన్ ,బీహార్ రాష్ట్రల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిని ఎంపీ ,ఎమ్మెల్యే పలకరించగా ఇక్కడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందినది అని ప్రశాంత వాతావరణంలో కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు, రైతు బంధు ,రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసు తో పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కి జేజేలు పలుకుతూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీ లలో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది అని , ఎన్నడూ లేని అభివృద్ధి జరిగినది అని కాలనీ ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెబెర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, కాలనీ ల వాసులు, కాలనీ ల అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS