భారతదేశ ఆర్థిక అసమాన్యుడు మన్మోహన్ సింగ్ అస్తమించడం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు……………….MLA మేఘా రెడ్డి_
*
సాక్షిత వనపర్తి :*
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్ర బిల్లును ఆమోదింపజేసిన ఆర్థిక అసమాన్యుడు..
భారతదేశ ఆర్థిక స్థిరత్వం కోసం ఎన్నో మహత్తరమైన పథకాలను రూపొందించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హస్తమయం దేశానికి తీరని లోటని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు
- హైదరాబాదులోని మాదాపూర్ లో గల తన కార్యాలయంలో ఎమ్మెల్యే దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా..
33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినాయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు వచ్చిన వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు
ఎన్నో ఆర్థిక సంస్కరణలు, చేపట్టి భారతదేశ అభ్యున్నతికి, దేశ ఆర్థిక పురోగతికి నిబద్ధతగా పాటుబడిన గొప్ప నాయకుడని ఆయన ప్రశంసించారు
ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు