
మంగళగిరి ఎయిమ్స్ సాంకేతిక సేవలు
AP: మంగళగిరి ఎయిమ్స్ కాగితరహిత సేవలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సేవలు పొందేందుకు తొలుత ‘అభ’(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) యాప్ను రోగులు లేదా వారి సంబంధీకులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్తో అనుసంధానమయ్యాక సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదుచేసి రిజిస్టర్ కావాలి. చికిత్సకు వెళ్లేటప్పుడు OPవిభాగం వద్ద ఉన్న QRకోడ్ను స్కాన్ చేస్తే కూపన్ నంబరు వస్తుంది. దాంతో నేరుగా వైద్యసేవలు పొందడానికి వెళ్లవచ్చు.
