ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించనున్న ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మనాలి ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి : రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, వారి సతీమణి మనాలి ఠాకూర్ స్థానిక గోదావరిఖని కేసీఆర్ కాలనీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించనున్న ఇళ్లకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటి స్థలంలో సంప్రదాయ పద్ధతిలో కొబ్బరికాయ కొట్టి భూమి పూజను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను అభినందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఇల్లు కలగాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి అర్హులైన కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆకాంక్షించారు.
అలాగే లబ్ధిదారులతో మాట్లాడి, ఇల్లు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని, సంతోషంగా గృహప్రవేశం చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 48వ. డివిజన్ కోర్ప్రెటర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి.రవి, ఉపేందర్, కిషన్, పాల.రమేష్,కందుకూరి సాయి,దామర. సమ్మయ్య, కార్యకర్తలు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
