SAKSHITHA NEWS

కన్నూర్ గ్రామంలో ఘనంగా మహాత్మ గాంధీ 155వ జయంతి వేడుకలు
జయంతి వేడుకలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ ఎంపీవో చెంద్రగిరి రవి
గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు

సాక్షిత కమలాపూర్ :
కమలాపూర్ మండల పరధిలో కన్నూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సాంబ రాజు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రాపటానికి పుష్ప గుచ్చలతో పూలమాలతో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు .ఆయన మాట్లాడుతూ సత్యం అహింస ఈ రెండిటిని అస్త్రాలుగా చేసుకొని స్వతంత్రం సాధించిపెట్టిన గొప్ప మహనీయుడు మన గాంధీజీ అని కొనియాడారు, జాతి పిత మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు అనంతరం కన్నూరు గ్రామసభను ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వంలో మంజూరు అయిన జనరల్ ఫండ్ ఎస్ ఎఫ్ సి ఫండ్ సి ఫండ్ రూపంలో వచ్చిన డబ్బులను గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్లు కమ్యూనిటీ హాల్లు మురికి కాలువల శానిటైజేషన్ వీధి దీపాలకై ఖర్చులను గ్రామపంచాయతీ భరిస్తుందని గ్రామసభలో గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది,

కన్నూరు స్పెషల్ ఆఫీసర్, మండల పంచాయతీ ఆఫీసర్ చంద్రగిరి రవి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం గత ప్రభుత్వం నిధులను కేటాయించేది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏలాంటి నిధులు ప్రవేశపెట్టలేదని ఆయన అన్నారు అలాగే ఆశ వర్కర్ల పనితీరు గురించి వివరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు దోమల నివారణకు డ్రైడే నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పలు సూచనలు ఇచ్చారు, అంగన్వాడీ టీచర్లు వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఇంత మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఇలాంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని విషయాలపై అడిగి తెలుసుకున్నారు అలాగే గ్రామపంచాయతీ సిబ్బంది మురికి కాలువలు ఎప్పటికప్పుడు తీయాలని విష జ్వరాలు రాకుండా షగింగ్ స్ప్రే చేయాలని తద్వారా దోమల నివారణను అరికట్టవచ్చని ఆయన అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఎండి అజీమా ఆశా వర్కర్లు ఇనుగాల కృష్ణవేణి బొల్లారం మంజుల అట్టికిల సరిత అంగన్వాడి టీచర్లు కసర బోయిన రజిత నాగపురి కవిత మహిళా సంఘం సిఏలు పెర్కా సుజాత లింగంపల్లి సరిత మరియు గ్రామపంచాయతీ సభ్యులు పరిశుద్ధ కార్మికులు, గ్రామ పెద్దలుపాల్గొన్నారు.


SAKSHITHA NEWS