దళిత అభ్యున్నతికి కృషిచేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ…… ఎమ్మెల్యే మెగా రెడ్డి

Sakshitha news

దళిత అభ్యున్నతికి కృషిచేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ…… ఎమ్మెల్యే మెగా రెడ్డి

సాక్షిత వనపర్తి :
దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు.

సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అనగారిన వర్గాల శ్రేయస్సుకోసం భాగ్య రెడ్డి వర్మ కృషి చేశారన్నారు. బాల్య వివాహాలు, అంటరానితనం, దేవదాసి, జోగిని వ్యవస్థలను రూపు మాపేందుకు పోరాటం చేశారని కొనియాడారు. దళిత ఉద్యమ పితా మహుడిగా, సంఘ సంస్కకర్తగా భాగ్యరెడ్డి ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారని, సమాజంలో దళితుల చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించారన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ మహానుభావుల జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని, మహానీయుల చరిత్ర, త్యాగాలను బావి తరాలకు అందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, దేశ భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం మహానీయులు ఆచరించిన మార్గాలను బావితరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలన్నారు.

కార్యక్రమం లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాంజీ రావు, మహనీయుల ఉత్సవ కమిటీ ఛైర్మెన్ గంధం నాగరాజు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top