కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగు… కనీస వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థిక భరోసా…

Sakshitha news

కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగు… కనీస వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థిక భరోసా…

– ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బొంకూరి కైలాసం….
….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కనీస వేతనాలను పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషదాయకమని దళిత బహుజన భవన నిర్మాణ కార్మిక శాఖ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి కైలాసం తెలిపారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ నిర్ణయం కార్మికుల సంక్షేమానికి చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

దళిత బహుజన భవన నిర్మాణ కార్మిక శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొంకూరి కైలాసం మాట్లాడుతూ, కార్మికుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి కనీస వేతనాలను పెంచిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిలకు కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా నాలుగు విభాగాలుగా వర్గీకరించి వేతనాలను సవరించడం అభినందనీయమన్నారు. అలాగే గతంలో ఉన్న అర్బన్, రూరల్ జోన్ల స్థానంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా విభజించి కనీస వేతనాలు నిర్ణయించడం ద్వారా కార్మికులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

కొత్త వేతనాల ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.12,750 నుంచి రూ.16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13,592 నుంచి రూ.17,000కు, స్కిల్డ్ కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500కు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.14,607 నుంచి రూ.20,000కు పెంపు లభించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ స్థాయిలో కార్మికుల కోసం కనీస వేతనాల సవరణ చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెల భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, ఇతర భాగస్వామ్యులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

నైపుణ్యం కలిగిన కార్మికులకు విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా గల్ఫ్ మరియు పశ్చిమాసియా దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలుకార్మికులకు కనీస వేతనాలు ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం సంతోషదాయకం – ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బొంకూరి కైలాసం జూన్ 1 నుంచి పెరిగిన కనీస వేతనాలు అమలు – 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేపడుతోందన్నారు. మధ్యవర్తుల మోసాలకు కార్మికులు గురికాకుండా అన్ని విధాల రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులందరికీ బొంకూరి కైలాసం శుభాకాంక్షలు తెలియజేశారు

Scroll to Top