ప్రజల భాగస్వామ్యంతోనే రామగుండం అభివృద్ధి సాధ్యం…..

Sakshitha news

ప్రజల భాగస్వామ్యంతోనే రామగుండం అభివృద్ధి సాధ్యం…..

–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ. డివిజన్‌లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ , నగర మేయర్ మహంకాళి స్వామి , 23వ. డివిజన్ కార్పొరేటర్ బెంద్రం సునీత రాజిరెడ్డి తో కలిసి విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డివిజన్ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అవసరాలు, మౌలిక వసతులపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం ప్రాంతాన్ని ఆదర్శ నగరంగా అభివృద్ధి చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా చెత్తను కాలువల్లో వేయకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అధికారులు–ప్రజాప్రతినిధులు–ప్రజలు కలిసి పనిచేస్తేనే రామగుండం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top