SAKSHITHA NEWS

ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మాదిగ విద్యార్థులు ఎదగాలి…

యర్రగొండపాలెం (మండలం) : మాదిగలు ఉన్నత స్థితిలో లేకపోవడానికి ప్రధానమైన కారణాలు విద్యార్థి దశలో వారికి ఆలోచించే విధానంలో నే స్పష్టత మరియు అవగాహన లేకపోవడం.. విషయాన్ని అర్థం చేసుకోవడంలో తొందరపాటు పడడం.. చాలామంది చెప్పవలసిన విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోవడం.. ఒకరినొకరు సహకరించుకోలేకపోవడం… ఈ అంశాల మూలంగా నే మాదిగలు సరైన స్థితిలో లేకపోవడం మనం గమనిస్తున్నామని…. త్రిబుల్ ఈ వ్యవస్థాపకులు మరియు
పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడైనటువంటి
పల్లె పోగు రవిరాజు అన్నారు.
పట్టణంలోని
వెంకట సాయి ఫంక్షన్ హాల్ లో త్రిబుల్ ఈ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు..
ఈ కార్యక్రమానికి పల్లె పోగు జాషువా అధ్యక్షత వహించగా… ముఖ్యఅతిథిగా చేదూరి రాజేష్ పాల్గొన్నారు.
ఉద్యమాలు మన ఉనికిని కాపాడతాయి. కానీ మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మారడానికి కావలసిన అవకాశాలను ఏర్పరచలేదని… కాబట్టి మాదిగ విద్యార్థులందరూ ఉన్నత స్థితికి ఎదగాలంటే వాళ్లని వాళ్లు పునః పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. బలమైన కోరికలను కలిగి ఉండి.. నీకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశాలు ఏంటియో గమనించుకొని ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకొని.. సమయాన్ని వృధా చేయకుండా వాటి వైపు ప్రయాణించాలని…..NIRD ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్ చాట్లా ఫ్రాంక్లిన్ ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో కోట సాంసన్. చేదూరి సుబ్బయ్య… నందిగాం సామ్యూల్
మాకం కమలబాబు. ఎనిబెర దావీదు .ఆరేవుల కృపారావు.తిమోతి మాదిగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS