మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో గల M-Gen (మల్టీ జనరేషన్) పార్క్ సుందరికరణ మరియు అభివృద్ధి నిర్మాణం పనులను మరియు మక్తా మహబూబ్ పెట్ చెరువు అభివృద్ధి కొరకు చేపట్టే పనులను మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి , జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి , డీసిలు మోహన్ రెడ్డి , ముకుందా రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీ లో గల M – Gen మల్టీ జనరేషన్ పార్క్ ను అన్ని రంగాలలో సుందరికరించి,అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ,అన్ని రకాల మౌళిక వసతులతో సుందరికరించి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువచ్చామని, త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు, వృద్దులకు, చిన్న పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, పార్క్ సుందరికరణ మరియు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ,అన్ని రకాల వసతులు కలిపిస్తామని, పార్క్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని PAC చైర్మన్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మయూరి నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలని, మయూరి నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ ప్రాధాన్యతలో భాగంగా మయూరి నగర్ లోగల పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని దానికి మయూరి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్యకర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, పార్కులో లో పూలు పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా మయూరి నగర్ అభివృద్ధికి కృషి చేస్తామనీ హామీ ఇచ్చారు. మయూరి నగర్ లో అందరూ ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రంలోని ఆదర్శ కాలనీ గా అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్, కాలనీ వాసులు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
మక్తా మహబూబ్ పెట్ విలేజ్ చెరువు కు త్వరలోనే మహర్దశ కలుగుతుంది అని, చెరువు ను సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు త్వరలోనే చేపట్టడం జరుగుతుంది అని,త్వరలోనే చెరువు సుందరికరణ పనులు చేపట్టి సుందర వనం శోభితం వనంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని,PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతామని ,చెరువు సుందరికరణ మరియు త్వరలోనే అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టి అదేవిధంగా చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE KVS రాజు, DE దుర్గ ప్రసాద్ , AE సంతోష్ కుమార్ ఇరిగేషన్ DE నళిని, AE పావని మరియు కాలనీ వాసులు, నాయకులు ,కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.