సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
ధర్మపురి పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో కలిసి పాల్గొన్నారు..*
ఈ సందర్భంగా మొదటగా మున్సిపల్ కార్యాలయం నుండి నంది చౌరస్తా,గాంధీ చౌరస్తా,హనుమాన్ విగ్రహం,చింతామణి చెరువు కట్ట మీదుగా ర్యాలీగా తరలివెల్లి మార్కెట్ సభ స్థలికి చేరుకున్నారు,అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించి స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా మంజూరు అయినా 511.50 లక్షల చెక్కును లబ్దిదారులకు పంపిణీ చేశారు.అనంతరం సుమారు 35 లక్షల విలువగల 35 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.తదుపరి పారిశుధ్య కార్మికులకు కొబ్బరి నూనె,డబ్బులు మొదలగునవి పంపిణీ చేశారు,అనంతరం ధర్మపురి మండలానికి సంబంధించి 557 అంగన్వాడి విద్యార్థులకు సంబందించిన యూనిఫామ్స్ పంపిణీ చేసి మెఫ్మా ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలను వీక్షించారు..
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవాలలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందనీ,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని,ధర్మపురి నియోజక వర్గానికి సంబంధించి నైట్ కాలేజీని పునః ప్రారంభించడం మరియు చేగ్యం బాధితులకు సంబంధించి 18 కోట్ల రూపాయల పరిహారాన్ని మంజూరు చేయించడం,అదే విధంగా మున్సిపల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు TFIDC కింద 15 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని,దానికి సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని,అదే విధంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా మంజూరు కావడం జరిగిందని,అదే విధంగా నియోజకవర్గానికి నవోదయ కలశాల కూడా మంజూరుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు రావడం జరిగిందని,త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని,అదే విధంగా 2027 లో జరగనున్న పుష్కరాలను కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందీ కాకుండా అత్యంత గొప్పగా నిర్వహిస్తామని,దానికి సంబంధించిన కూడా పార్టీలతో సంబంధం లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు స్వీకరిస్తామని,ధర్మపురి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని ఈ సంధర్బంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.