బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “లిటిల్ విల్లే” స్కూల్ ప్రారంభం…. నూతన విద్యారంభానికి అంకురార్పణం…
సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని కొంపల్లి సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన “లిటిల్ విల్లే” స్కూల్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పిల్లల భవిష్యత్తును బంగారు మయంగా మార్చడంలో “లిటిల్ విల్లే” ముందుంటుందని తాను విశ్వసిస్తున్నానని, పిల్లల ఉజ్వల భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అశ్విని, పాక్స్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, నాయకులు పూజారి లక్ష్మణ్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, కుంటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY