SAKSHITHA NEWS

చెన్నూరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌ను చెన్నూరు ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

అలాగే, తనకు కూడా లయన్స్ క్లబ్‌లో మెంబర్‌షిప్ ఉందని గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే , క్లబ్‌ సభ్యులతో కలిసి పనిచేసి సమాజానికి సేవ చేయడం గర్వంగా అనిపిస్తుందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS