SAKSHITHA NEWS

ఏసీబీకి చిక్కిన లింగంపేట సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్

కామారెడ్డి జిల్లా:
వెహికల్ కన్సల్టింగ్ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే..ద్విచక్ర వాహనాలను అమ్మకాలు కొనుగోలు చేసే వ్యక్తి నుంచి లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించాడు. వారి సూచనల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందానికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

కాగా, గతేడాది డిసెంబర్ మొదటి వారంలో స్టేషన్ బెయిల్ విషయంలో లంచం తీసుకుంటూ అప్పటి ఎస్‌ఐ అరుణ్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. నేడు ఆయన స్థానంలో విధులు చేపట్టిన సుధాకర్ 40 రోజుల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ దొరకడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app