SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి,నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ ను మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి , జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి , డీసీ లు ముకందా రెడ్డి , మోహన్ రెడ్డి , కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , ఉప్పల పాటి శ్రీకాంత్ గార్ల తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

,ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టడం జరిగినది అని, పనులు తుది దశలో ఉన్నాయి అని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన చేపట్టాలని, త్వరలో నే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని,పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని ,పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు. కల్వర్ట్ నిర్మాణము పై మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు పై అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని , ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరునని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

అదేవిధంగా
వర్షం పడుతున్న ప్రతి సారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని,ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను ,శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
శేరిలింగంపల్లి లో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజాం కోసం కృషి చేశామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు.

అనంతరం నల్లగండ్ల కురగాయల మార్కెట్ ను పరిశీలించడం జరిగినది. మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని ,మార్కెట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. చెరువుల సుందరికరణ మరియు వాటి సంరక్షణ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని, ప్రధానంగా విలువైన చెరువు స్థలాల సంరక్షణ, చెరువు కట్టల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్‌ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌, పచ్చదనం సహా పలు ఇతర అభివృద్ధి పనులతో అనతికాలంలోనే గోపి చెరువు రూపురేఖలు మార్చుకుని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధం అయ్యేలా మేయర్ ఫోన్లో మాట్లాడి చర్యలు చేపట్టమని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాల పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోగాల బారిన పడకూడదని సూచించారు. అనంతరం గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద ఎదురుకుంటున్న ట్రాఫిక్ సమస్యను మేయర్ కి, ఎమ్మెల్యే కి కార్పొరేటర్ వివరించారు, రోడ్డు విస్తరణ చేసి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం జోనల్ కార్యాలయం ఎదురుగ నూతనంగా చేపట్టిన ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌళికవసతుల కల్పనకు కృషి చేస్తున్నాం అని, మౌళికవసతులు కల్పించడంలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నాం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE శంకర్ నాయక్, EE Gkd ప్రసాద్ , DE ఆనంద్, AE భాస్కర్, మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS