SAKSHITHA NEWS

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు

విమానాల పై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్ట్​లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీచేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌కు పాల్పడేవారికి జీవితఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. చట్టంలో మార్పుల ప్రకారం కఠిన శిక్షలు, జరిమానా ఉంటుందని తెలిపారు.


SAKSHITHA NEWS