జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం. కమిషనర్ ఎన్.మౌర్య
జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. కరకంబాడి మార్గంలోని బయోట్రిమ్, ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు ఉపాద్యాయ నగర్ లోనికి వస్తున్నాయని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో ప్రజలు కమిషనర్ కు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేంద్రన్ తో కలసి కమిషనర్ బయోట్రిమ్, ఉపాద్యాయనగర్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన్యప్రాణులు జానావాసాల్లోకి వస్తున్నాయని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. అవి రాకుండా తగు చర్యలు చేపడదామని అన్నారు. ఉపాద్యాయ నగర్ వైపు ప్రహరీ గోడ నిర్మించాలని పరిశీలన చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఉపాద్యాయ నగర్ రోడ్డు వెంబడి ఉన్న డ్రెయినేజీ కాలువలో చెత్త తీసి బయోట్రిం వైపు వేయడం, వర్షాలు వచ్చినప్పుడు డ్రెయినేజీ పొంగి బయో ట్రిమ్ లోకి వస్తున్నాయని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ను కోరారు. అలాగే బయో ట్రిమ్ నందు నివాసం ఉంటున్న వారి వద్ద ఉత్పన్నమయ్యే చెత్తను తీసుకెళ్ళ్లె చర్యలు చేపట్టాలని కోరారు. డ్రైనేజీ కాలువలో చెత్తను, నివాసాల్లో ఉత్పన్నమయ్యే చెత్తను తరలించేందుకు ఫారెస్ట్ అధికారులతో చర్చించి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాలని హెల్త్ ఆఫీసర్ ను కమిషనర్ ఆదేశించారు. అలాగే బయో ట్రిమ్ లోకి కుక్కలు వెళ్లకుండా పట్టి స్టరిలైజ్ చేయిస్తామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, అసిస్టెంట్ సిల్వికల్చరిస్ట్ పవన్ కుమార్, అసిస్టెంట్ కంజర్వెటర్ ఆఫ్ ఫారెస్ట్ సోమ శేఖర్, తదితరులు ఉన్నారు.