SAKSHITHA NEWS

న్యాయవాదులపై పోలీసుల ధమనకాండ కు నిరసనగా వనపర్తి కోర్టులను బహిష్కరించిన న్యాయవాదులు

*సాక్షిత వనపర్తి :
మాదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ కలీం అనే న్యాయవాదిపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా రాష్ట్ర న్యాయవాదుల సంఘం పిలుపుమేరకు వనపర్తిజిల్లాలోని అన్ని కోర్టుల విధులను న్యాయవాదులు కలిసి బహిష్కరించడం తోపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ న్యాయవాదులపై ఇలాంటి అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్న తరుణంలో న్యాయవాద మిత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకురావాలని భవిష్యత్తులో ఏ న్యాయవాదిపై ఎలాంటి భౌతిక దాడి జరగకుండా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను రూపొందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ ఉపాధ్యక్షులు డేగల కృష్ణయ్య కార్యదర్శి నెమలి కంటి బాలనాగయ్య మరియు సీనియర్ న్యాయవాదులు వనగంటి నాగేశ్వర్ పురుషోత్తం వెంకటేశ్వర రెడ్డి దినేష్ రెడ్డి గాదం ఉత్తరయ్య మరియు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS