
కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని వైసీపీ చూస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మీపార్వతి.రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని అభ్యర్థించారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు.
