SAKSHITHA NEWS

తాణాం గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురైన ఉపాధి కూలీ…
ఏపీట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్య వైఖరే కారణమంటున్న గ్రామస్తుల.
ఉపాధి హామీ కార్మికుడికి పూర్తిస్థాయిలో ప్రభుత్వమే వైద్య సేవలు అందించాలి.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టి డిమాండ్..

సాక్షిత : పరవాడ మండలం తాణాం గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురైన ఉపాధి కూలీ తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధి కార్మికుడుకి పూర్తిస్థాయి లోవైద్య సేవలు ప్రభుత్వమే అందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మొక్కలకి కంచే వేస్తుండగా 220 కేవి విద్యుత్ తీగలు కిందకి వాలి ఉండడంతో ప్రమాదంజరిగింది. 80% కాలిపోయిన శరీరం తో కార్మికుడు కొట్టిమిట్టాడుతున్నాడని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉపాధి కూలీ విద్యుత్ ఘాతానికి గురై శరీరం మొత్తం కాలిపోయి మృత్యువుతో పోరాడుతున్న ఘటన జరిగిందని గనిశెట్టి మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలిగా పనిచేస్తున్న చీపురుపల్లి అప్పారావు క్లీస్ ఆంధ్ర గ్రీన్ అంధ్రాలో భాగంగా కంసాలి చెరువులో కొబ్బరి మొక్కలకు కంచె కడుతుండగా శుక్రవారం విద్యుత్ ఖాతానికి గురయ్యాడు.

అప్పర్ సీలేరు నుండి పెందుర్తి వెళ్లే ఏపీ ట్రాన్స్కో తీగలు ఉపాధి కూలీ పని చేస్తున్న చెరువులో బాగా కిందకి వాలు ఉన్నాయి. భూమికి కేవలం పది అడుగులు ఎత్తులో ఉండడంతో అక్కడే పనిచేస్తున్న అప్పారావును ఆకర్షించడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. సుమారు 80శాతం శరీర మొత్తం కాలిపోయింది. హుటాహుటిన స్థానికులు క్షతగాత్రుడుని విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అప్పారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించారు. గతంలోనే ఏపీ ట్రాన్స్ కో కి చెందిన విద్యుత్తు తీగలు చాలా కిందకి వాలు ఉన్నాయని సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అని గని శెట్టి తెలియజేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని గనిశెట్టి డిమాండ్ చేశారు ప్రభుత్వం బాధితుడి కి మెరుగైన వైద్య సేవలు అందించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేసారు.


SAKSHITHA NEWS