బాచుపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 274వ డివిజన్ బాచుపల్లి పరిధిలోని SVS అబర్న కాలనీలో రూ.23 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు.
కాలనీలో ఉన్న సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గత నెలలో స్థానికులు కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి, ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో (CMC) రూ.23 లక్షల నిధులను మంజూరు చేయించి ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కొలన్ హన్మంత్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించి, తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ ఇంచార్జి కొలన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, రాజి రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులూ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
