SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ కంఠం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని mro కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

గండిమైసమ్మ దుండిగల్ మండలo దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో బౌరంపేట్, మల్లంపేట్,దుండిగల్, గాగిల్లాపూర్,బహదూర్ పల్లి, డి పోచంపల్లి,శంబిపూర్, నాగులూరు గ్రామాల గ్రామ ఖంఠంలోని ప్రజలు తాతలనాటి నుండి నివాసం ఉంటున్నవారు మారిన పరిస్థితులు బట్టి ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా లోన్ తీసుకోవాలన్నా అమ్మకాలు కొనుగోలు చేయాలన్న తల్లిదండ్రులను కోల్పోయిన వారు వారసుల పేరు మార్చుకోవాలన్న విషయంలో గ్రామకంఠం సర్టిఫికెట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ఈ యొక్క గ్రామాలలో రెవెన్యూ మేళా ఏర్పాటు చేసి ఇల్లు ఇంటి స్థలం సర్వే చేసి వెంటనే గ్రామ కంఠం సర్టిఫికెట్లు మంజూరు చేయగలరని గతంలో గ్రామ పంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీ త్వరలో జిహెచ్ఎంసి లో విలీనం ఐతే ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కావున ఈయొక్క ప్రజా సమస్య దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్యలు తీసుకోగలరని కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ తరఫున కోరడం జరిగింది

ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జిల్లా ఇన్చార్జ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి జిల్లా కోశాధికారి పీసరి కృష్ణారెడ్డి మున్సిపల్ అధ్యక్షులు ఏ మల్లేష్ యాదవ్ బౌరంపేట్ బిజెపి నాయకులు ఆర్ నరసింహ చారి,డి ప్రభాకర్ రెడ్డి,డి సీతారాం రెడ్డి, మల్లంపేట్ బీజేపీ నాయకులు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ దుండిగల్ బీజేపీ నాయకులు ఆకుల విజయ్, భాను గౌడ్,యశ్వంత్ పటేల్, తండా గాగిల్లాపూర్ బీజేపీ నాయకులు రోజా,వెంకటేష్ నాయక్ తదితర గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS