కేటీఆర్ కొత్త డ్రామా: ఆది శ్రీనివాస్
అమృత్ టెండర్లలో అక్రమాలు నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చేసిన సవాల్‌కు కేటీఆర్ సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాజీనామా చేయాల్సి వస్తుందని భయపడే.. సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓపెన్ టెండర్లలో అర్హత సాధించిన వారికే కాంట్రాక్టు వచ్చిందని, రూ.3,516 కోట్ల టెండర్లు పిలిస్తే ఆయన రూ.8 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంట్రాక్టు పొందిన సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అల్లుడనే విషయం ముందు కేటీఆర్ తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అమృత్ టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్ నేతలను టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ ప్రశ్నించారు. కాగా, సింగరేణి కార్మికులకు బోన్‌సపై బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన బోనస్ కంటే రూ.20వేలు అధికంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు.