SAKSHITHA NEWS

కృష్ణాజిల్లా మచిలీపట్నం

మహిళల భద్రతే మన ప్రధాన ధ్యేయం:-కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు

మీ యొక్క మొబైల్ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి:- పోలీసు వారి తక్షణ సహాయాన్ని పొందండి

నూతన శక్తి టీమ్లను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర డిజిపి శ్రీహరిష్ కుమార్ గుప్తా గారి ఉత్తర్వుల మేరకు మహిళల పై జరిగే నేరాలు అరికట్టేందుకు మహిళల భద్రతకు భరోసాగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 40 మంది సిబ్బందితో 20 శక్తి టీం బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది

ఈ టీమ్లను మరింత బలవపేతం చేసే ఉద్దేశంతో అదనంగా 12 టీం లోని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్లను కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.. శక్తి టీం సిబ్బంది వారు చేయవలసిన విధులు పాటించవలసిన నియమ నిబంధనలు గూర్చి దిశా నిర్దేశం చేశారు

శక్తి టీం సిబ్బందిని ఉద్దేశించి కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ:-

మహిళా వివక్ష హింస లైంగిక వేధింపులకు సమాజంలో స్థానం లేదు మహిళల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత నిస్తుంది దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయి లో అమలు చేయడం జరుగుతుంది..

అందులో భాగంగా ఈ రోజు ఒక మహిళ ఎస్సై నేతృత్వంలో ఇద్దరు మహిళా సిబ్బంది ముగ్గురు పురుష కానిస్టేబుల్ తో మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన 12 శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీం బృందాలు మఫ్తిలో విధులు నిర్వహిస్తూ సామాన్య ప్రజలతో కలిసిపోయి స్థానిక పరిస్థితులను గమనిస్తూ అవసరం మేరకు పనిచేస్తాయి ..

మహిళలపై వేధింపులు హింస ఈవిటీజింగ్ ఇతర నేరాలు అరికట్టేందుకు మహిళా భద్రతను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ఈ బృందాలను ఏర్పాటు చేశాము

నిరంతరం కళాశాలలో బస్టాండ్ షాపింగ్ మాల్స్ జనసేన అధికంగా ఉండే ప్రదేశాల్లో పహారా కాస్ట్ మహిళలపై జరిగే వేధింపులు అరికట్టడంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు వారికి తోడుగా మేమున్నామనే నమ్మకం కలిగించాలి

మహిళలు చిన్నారులు ఎవరైనా సరే సమస్యలు ఉన్నామంటే అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నాము అని శక్తి యాప్ ద్వారా మీ సహాయం కోసం అర్జిస్తే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని వారికి భరోసాగా నిలవాలి మహిళల రక్షణ చట్టాలను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తక్షణ సహాయం పొందడం కోసం వారి కోసం ప్రత్యేకంగా ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లు 1098, 1930,112, 181, గురించి వారికి తెలియజేశారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app