జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో కోటపల్లి మండల సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలెక్టర్ కి వ్రాసిన లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ కి కోటపల్లి మండల కేంద్రంలోని 100 ఇండ్లు ఆర్ అండ్ బి రోడ్డు వెడల్పులో పోయినందున ఇవ్వాలని మరియు షెడ్యూల్ కులాల హాస్టల్ వసతి గృహము శిథిలావస్థలో ఉన్నందున కొత్త బిల్డింగ్ కట్టాలని మరియు కోటపల్లి మండలంలో గల పోడు భూముల కు 40 50 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఈ సమస్యలన్నీటిపై కేంద్ర మంత్రి ఇచ్చిన లెటర్ ను ఈరోజు కలెక్టర్ కి ఇవ్వడం జరిగినది కలెక్టర్ స్పందించి కేంద్ర మంత్రి కి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ కొరకు లెటర్ వ్రాస్తానని తెలియజేసినారు
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి 20 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఒక కోటి 80 లక్షల తోని కోటపల్లి మండల కేంద్రంలో హాస్టలు డబుల్ బెడ్ రూములు గాని అన్నిటికీ కేటాయిస్తానని హామీ ఇచ్చినారు కేంద్ర మంత్రివర్యులకు లెటర్ వ్రాయగానే మా బిజెపి జిల్లా అధ్యక్షులు వేరబల్లి రఘునాథు రావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు కలిసి ఈ శాంక్షన్ తెప్పిచ్చి కోటపల్లి మండల అభివృద్ధి చేయగలమని విశ్వసిస్తున్నాను ఇట్లు కోటపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మంత్రి రామయ్య