SAKSHITHA NEWS

|| సీఎం సహాయనిధి నుండి (LOC) ని మంజూరి చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 126 డివిజన్ జగద్గిరిగుట్ట లోని అంజయ్య నగర్ కి చెందిన శ్రీనివాస్ మామిడి గత కొన్నిరోజులుగా కుడి చేతికి గాయం అయి సర్జరీ కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు అని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 50,000/- ల సీఎం సహాయనిధి నుండి (ఎల్వోసీ) ని మంజూరి చేయించి రూ 50,000/- ( యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను మామిడి శ్రీనివాస్ కు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, కొలన్ రాజశేఖర్ రెడ్డి, NSUI నాయకులు గోళ్ల జాన్, బాలకృష్ణ, హమ్మి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS