కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో SIR (Special Intensive Revision) కార్యక్రమంపై ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఓటర్ల నమోదు, కొత్త ఓటర్ల చేర్పు, ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణ, పేరు–చిరునామా మార్పులు, అనవసరంగా ఓటర్ల తొలగింపులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
SIR ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కొలన్ హన్మంత్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ………. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలాధారమని, ప్రతి పౌరుడు తన ఓటు వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, సందేహాలను సవివరంగా నమోదు చేసి, సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
