నష్టపరిహారం పెంచాలని బుద్దారాం రిజర్వాయర్ ముంపు బాధితుల రాస్తారోకో
డబల్ బెడ్ రూం ఇళ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్.
చిన్నారెడ్డి తాసిల్దార్ ల హామీలతో ఆందోళన విరమించిన రైతులు
సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం లోని గోపాల్ పేట మండలం బుద్దారం పెద్ద చెరువు రిజర్వాయర్ నీటి ముంపు రైతులు భూములు కోల్పోతున్న రైతులు మాకు నష్టపరిహారం పెంచాలని దాదాపు 2గంటలపాటు గ్రామంలోని చౌరస్తా లో వాహనాలు నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వాయర్ లో మునిగిపోయిన శిఖం భూములకు మొదటి విడతగా రైతులకుగతములో 12లక్షల 40వేల రూపాయలు ఎకరాకు చెల్లించారని ఈ భూములు ఎప్పుడూ నీటి మునకలో ఉంటాయని అన్నారు.
రెండవ విడతలో దాదాపు 110ఎకరాల సారవంతమైన భూమి మునకకు గుర్రవుతున్నది అని ఈ భూములు రెండు పంటలు పండేవిగా అందులో వ్యవసాయ బావులు,బోర్లు వ్యవసాయయోగ్యంగా ఉన్నాయని ఈ భూములకు కూడా ఎకరాకు 12లక్షల 40వేలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుందని దీన్ని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
వ్యవసాయయోగ్యమైన భూములు కోల్పోతున్న రైతులు
ఎకరాకు 40లక్షల నష్టపరిహారం చెల్లించాలని.
ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని
ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని
స్వయం ఉపాధి కోసం 10లక్షల ఋణ సౌకర్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారని సర్పంచ్ శేఖర్ గౌడ్ అన్నారు.
నిర్మించుకున్న డబల్ బెడ్ రూమ్ లకు బిల్లులు చెల్లించాలి.
బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాములో సొంతంగా 40 డబల్ బెడ్ రూమ్స్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చిందని ఇళ్లను నిర్మించుకొని మూడేండ్లు అవుతున్న నేటికి బిల్లులు చెల్లించడం లేదని వెంటనే బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
చిన్నారెడ్డి
తహసీల్దార్ ర్ల హామీతో రాస్తారోకో విరమణ.
రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించిన రైతులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తహసీల్దార్ తో కలసి ముంపు రైతులకు పరిహారం పెంచేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతామని అదేవిధంగా నిర్మించుకున్న 40డబల్ బెడ్ రూమ్స్ కు వెంటనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఈ రాస్తారోకో లో సర్పంచ్.శేఖర్ గౌడ్,ఉప సర్పంచ్ శివాజీ,కావలి.కృష్ణయ్య,శేఖర్,నాగేంద్రం,లక్ష్మయ్య,పెద్ద వెంకటేష్ మాజీ ప్రజాప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
