SAKSHITHA NEWS

జాతీయ కుడో విజేతలను
అభినందించిన కేఎన్ఆర్

క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ – కేఎన్ఆర్

గాజువాక ఉక్కునగరం బియంఎస్ హాల్ లో హరికృష్ణ ఫిట్నెస్ జోన్ తరపున కుడో జాతీయ పోటీల్లో వివిధ కేటగిరీల్లో గెలుపొందిన ఇరవై ఎనిమిది మంది క్రీడాకారులకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా కిక్ భాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజెపి గాజువాక కన్వీనర్ డా కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ నవంబరు నెల ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరిగిన జాతీయ కుడో పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం నుండి పాల్గొన్న క్రీడాకారులు బంగారు రజిత కాంస్య పతకాలు సాధించారని అన్నారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ కూడా ఉంటుందని అన్నారు. క్రీడా కోటాలో ఉన్నత విద్య కోసం మరియు ఉద్యోగ అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్ ఉంటుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సియం చంద్రబాబు నాయుడు క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. కేలో ఇండియా పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులకు అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని అన్నారు. రాష్టృ కుడో సంఘం అధ్యక్షుడు ఎ.శశిధర్ మాట్లాడుతూ ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ జాతీయ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించారని అన్నారు. విధ్యార్దులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. భారత క్రీడా సంస్థ మరియు రాష్ట్ర క్రీడల సంస్థ గుర్తింపు పొందిన ఏకైక క్రీడా సంస్థ కుడో అని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బలిరెడ్డి.సత్యనారాయణ , విల్లా రామ్మోహన్ కుమార్,నాగేశ్వరరావు,బొత్స దిలీప్ కుమార్,జగదీష్,రంగనాయకులు,కృష్ణారెడ్డి,రాష్టృ కుడో డైరెక్టర్ అనురాధ, ప్రధాన కార్యదర్శి రవిబాబు,శివకాళీరావు,కోటిరెడ్డి,నాగయశ్వంత్ ,రమణ,పేర్ల అప్పారావు,కదిరి.భూలోక ,,కోచ్లు ,రిఫరీలు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కుడో పోటీల్లో పథకాలు సాధించిన వారు ప్రియావైష్ణవి,కొణతాల.సాయిలాస్య,తెప్పల.తనుజశ్రీ,ఎస్.రోహిణి,ప్రజ్ఞశ్రీ,గీతిక,సాయిహనీస,హృతిక్,షన్ముక్,శ్రీహర్ష,వెంకటసాత్విక్,దుర్గాప్రసాంతి,
ఫణీంద్రా కుమార్,రాజేష్,మణికంఠ,సుహాస్,అభిరామ్,వంశీ,శశిధర్,తులసీరావు,జగదీష్,పావనసునైనా,ప్రహర్షిత,అక్షిత్ వర్మ,తేజ,హర్షవర్ధన్ వున్నారు.


SAKSHITHA NEWS