తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు అండగా నిలిచి దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్ పల్లి నియోజక వర్గంలోని కే.పి.హెచ్.బి కాలని డివిజన్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా మల్టిపర్పస్ ఫంక్షన్ హాలులో జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో వికలాంగులకు సైకిళ్లను , చేయూత పరికరాలను , వికలాంగుల గ్రూపులకు వడ్డీలేని 10 లక్షల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ వికలాంగులను గుర్తించి రెండు వందల పెన్షను నాలుగు వేలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. నియోజక వర్గంలో వికలాంగులను దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయల విలువగల మోటారు వాహనాలను అందించామని గుర్తుచేశారు. జిహెచ్ఎంసి వారు అందించే త్రీ వీలర్ సైకిల్ వికలాంగులకు ఇబ్బందికరంగానే ఉంటాయని అధికారులు వీలైతే మోటార్ వాహనాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు వీలైతే రాబోయే సంవత్సరం మరికొంతమంది వికలాంగులకు మోటార్ సైకిల్ ను అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, శిరీష బాబురావు, మహేందర్, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.