నాశబోయిన నరసింహకు కవి శేఖర బిరుదు
చిట్యాల సాక్షిత ప్రతినిధి
తెలుగు వెలుగు జాతీయ సాహిత్య వేదిక, ఎస్ వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి శతాధిక కవితా పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి నందుకు,తాను అందించిన సాహితీ సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ లో జరిగిన జాతీయ సాహిత్య సంబరాల్లో చిట్యాల పట్టణానికి చెందిన కవి,రచయిత నాశబోయిన నరసింహ (నాన)కు”కవి శేఖర” బిరుదుతో పాటు జాతీయ సాహిత్య పురస్కార జ్ఞాపిక, షీల్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్,కండువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహకు సాహితీ మిత్రులు,బందువులు,తోటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పలువురు అభినందనలు తెలిపారు. తెలుగు భాషాభిమానంతో సాహితీ సేవ చేయడం గొప్ప వరంగా భావిస్తున్నానని నాన కవి అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ సంస్థ జాతీయ అధ్యక్షులు పిఆర్.ఎస్ఎన్. మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి, చైర్మన్ ఎస్.వి. ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు,ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, కిలపర్తి దాలినాయుడు,మీసాల చిన గౌరినాయుడు, పైడి నవనీత రవీందర్ పాల్గొన్నారు.