కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర ఆదేశాలతో దాతృత్వం చాటుకున్న వడ్లమూడి
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి శేషయ్య (46) ఇటీవల గుండెపోటుతో చెన్నైలోని వైద్యశాలలో మరణించారు. శేషయ్య సతీమణి గొల్లపల్లి ఎలిశమ్మ రోజువారి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎలిశమ్మ భర్త గొల్లపల్లి శేషయ్య గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో వారి కుటుంబానికి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో విఎన్ఆర్ మైన్స్ అండ్ మినరల్స్ అధినేత వడ్లమూడి నాగేంద్రబాబు 50 వేల రూపాయల నగదును ఎలిశమ్మ కు వడ్లమూడి నాగేంద్రబాబు సన్నిహితులు , వడ్లమూడి ప్రతినిధి మన్నెం వెంకటస్వామి,సోమవారం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి ల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసాపురం టిడిపి నాయకులు మద్దిశెట్టి రవిశంకర్, మోపాడు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు మోరుబోయిన గిడ్డయ్య యాదవ్, పామూరు మాజీ సర్పంచ్ కావిటి వెంకటసుబ్బయ్య, విఎన్ఆర్ మేనేజర్లు సయ్యద్ బాబు, ఈర్ల ఏడుకొండలు, మోపాడు టిడిపి నాయకులు యరశింగ్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
