టాస్క్ ఫోర్స్ లో “చవితి” క్రికెట్ మ్యాచ్
** కప్ గెలుచుకున్న పోలీస్ స్టేషన్ టీమ్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) మైదానంలో శనివారం క్రికెట్ మ్యాచ్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఈ పోటీలలో పోలీస్ స్టేషన్ టీమ్, ఆపరేషన్ టీమ్, హెడ్ క్వార్టర్స్ టీమ్ లు పాల్గొన్నాయి. ఫైనల్స్ కు హెడ్ క్వార్టర్స్ టీమ్, పోలీస్ స్టేషన్ టీమ్ లు చేరుకున్నాయి. 10 ఓవర్లకు గాను పోలీసు స్టేషన్ టీమ్ 93 పరుగులు చేయగా, హెడ్ క్వార్టర్స్ టీమ్ 90 పరుగులు తీసి వెనుకబడింది. మ్యాచ్ లో గెలుపొందిన పోలీసు స్టేషన్ టీమ్ కు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ట్రోఫీని బహూకరించారు. ఇందులో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికైన కానిస్టేబుల్ రాఘవకు షీల్డ్ అందజేసారు. ఎస్పీ మాట్లాడుతూ ఎర్ర చందనం ఆపరేషన్స్ లో బిజీగా ఉండే సిబ్బందికి ఆటవిడుపుగా ఈ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది అందరూ ప్రతిభ కనపరిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వి. శ్రీనివాస రెడ్డి, ఎండీ షరీఫ్, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్, ఆర్ఐ సాయి గిరిధర్, ఎస్ఐ రఫీ, ఆర్ఎస్ఐలు లింగాధర్, విష్ణు వర్ధన్, వినోద్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
