క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి ఎప్పుడూ ముందుంటారు : ప్రత్తిపాటి
….
- సాక్షిత : చంద్రబాబు రాజధానిలో నిర్మించ తలపెట్టిన స్పోర్ట్స్ సిటీ క్రీడాకారులకు వరం : ప్రత్తిపాటి.
- 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో మంత్రి నారాలోకేశ్ నిరుద్యోగులతో పాటు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు : ప్రత్తిపాటి.
- రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభించిన మాజీమంత్రి.
క్రీడలన్నా..క్రీడాకారులన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో ఇష్టమని, వారిని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ క్రీడలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవశాలి చంద్రబాబని, ఏపీలో మరోసారి జాతీయ క్రీడల నిర్వహణపై ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని సీ.ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలను శనివారం ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో మాట్లాడిన ఆయన వారిని పేరుపేరునా అభినందించారు. క్యారమ్స్ లో జాతీయస్థాయిలో రాణించి గుర్తింపు పొందిన జనార్థన్ రెడ్డి, కుసుమ సమీరలను సత్కరించిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు. రాష్ట్రస్థాయి క్యారమ్స్, చెస్, షటిల్ పోటీల నిర్వహణ ద్వారా స్థానిక సీ.ఆర్ క్లబ్ ఎంతో మంది ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారుల్ని దేశానికి పరిచయం చేసిందని, ప్రత్తిపాటి తెలిపారు. క్లబ్ నిర్వాహకులు ఎన్నోఏళ్ల నుంచి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం క్రీడలపై ముఖ్యమంత్రికి ఉన్న మక్కువకు నిదర్శనం
ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, క్రీడాకారులంటే ఆయనకు ఎంతో మక్కువని ప్రత్తిపాటి చెప్పారు. రాజధాని అమరావతిని నవనగరాలకుగా నిర్మించాలన్న ఆయన ఆలోచన ఎంతో గొప్పదన్న ప్రత్తిపాటి, ఒక నగరంగా స్పోర్ట్స్ సిటీ నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన క్రీడలపట్ల ఆయనకున్నమక్కువ, ప్రాధాన్యతకు నిదర్శమన్నారు. మరోసారి రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్న ప్రత్తిపాటి, ఆ దిశగా ఇప్పటికే జాతీయస్థాయి క్రీడా సంస్థలతో, కేంద్రంతో సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రి నారా లోకేశ్ విద్యతో పాటు, విద్యార్థుల్లోని క్రీడాప్రతిభను వెలికితీసే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో (మెగా డీఎస్సీ అమలు) మంత్రి లోకేశ్ నిరుద్యోగులతో పాటు, విద్యార్థులకు ఎంతో మేలు చేశారని ప్రత్తిపాటి తెలిపారు. కూటమిప్రభుత్వం ప్రతిభను ప్రోత్సహిస్తుందని, పాఠశాల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో ప్రతిభచూపి ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మక్కెన నరసింహారావు, మురకొండ మల్లిబాబు, చెరుకూరి కాంతయ్య, గద్దె వేణు, మస్తాన్ వలి, తదితరులున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
