గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించి, గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కన్నయ్య మాట్లాడుతూ, వర్షాలతో రోడ్లు అద్వానంగా మారాయని, డబుల్ బెడ్ రూం ఇళ్ల పై కప్పుల నుండి నీరు కారుతోందని, విద్యుత్ స్తంభాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంచాయతీకి నిధులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
