బాబాసాహెబ్ కు కాకాణి ఘన నివాళి”
సాక్షిత SPS నెల్లూరు జిల్లా:*
మహనీయుడు, మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి .
సృష్టిలో సూర్య, చంద్రులు ఉన్నన్ని నాళ్లు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా, చిరస్థాయిగా ఉండిపోతారు.
అంబేద్కర్ తన చిన్నతనం నుండి కుల వివక్ష, అంటరానితనం లాంటి ఎన్నో దురాగతాలను భరించి, భారత దేశంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగి, మహనీయుడిగా కీర్తించబడినారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు నిరంతరం శ్రమించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలిచారు.
చంద్రబాబు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్లే, అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, తర్వాత పట్టించుకోలేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో ఆంధ్రులు అందరూ గర్వించే విధంగా, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి, దేశానికే ఆదర్శంగా నిలిచారు.
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహనీయుడు అంబేద్కర్ ఆశయ సాధన కోసం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసికట్టుగా కృషి చేస్తాం.