కైసర్ నగర్ వాసవి క్లబ్ వనిత వీరభద్ర అసోసియేషన్ ప్రమాణస్వీకారన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి వైస్ ప్రెసిడెంట్ కూన శ్రీనివాస్ గౌడ్……
సాక్షిత : గాజులరామారం డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ వాసవి క్లబ్ వీరభద్ర నూతన కమిటీ అధ్యక్షురాలుగా భవాని ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి ఉపాధ్యక్షులు *కూన శ్రీనివాస్ గౌడ్ * ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా *డిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ * మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంటారని, అదేవిధంగా కష్టం వస్తే కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు, అదేవిధంగా మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వాసవి క్లబ్ అసోసియేషన్ వారికి ఉంటాయని తెలిపారు.. అదేవిధంగా నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన భవాని కి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు..
అనంతరం నూతన అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ సభ్యులకు కూన శ్రీనివాస్ గౌడ్ కి శాలువాతో సత్కరించారు…
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు సముద్రాల కృష్ణమూర్తి, ప్రదీప్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, తోసిపు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY